Medak: మెదక్‌లో త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం: కలెక్టర్ ప్రతిమా సింగ్!

Medak: మెదక్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ త్వరలో ప్రారంభం: కలెక్టర్ ప్రతిమా సింగ్. 395 పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పౌష్టికాహారం.

NAGARAJ, MEDAK
Published on: 22 Sept 2026 5:16 PM IST
Medak
X

Medak: మెదక్‌లో త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం: కలెక్టర్ ప్రతిమా సింగ్!

మెదక్, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కలెక్టర్ పరిశీలించారు. కిచెన్‌లోని యంత్రాలు, సామగ్రి, వాటి సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కిచెన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలోని 395 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీఈవో రాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మెదక్ కిచెన్ ప్లాంట్ మేనేజర్ పునీత్ త్రిపాఠి, హెచ్‌కేఎం ట్రస్ట్ ఆర్గనైజర్ వీర, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ నవీన్, జిల్లా విద్యాశాఖ కార్యాలయ బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌చార్జి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK