Toopran: కిష్టాపూర్‌లో మాదిగలపై కుల బహిష్కరణ బాధ్యులపై చర్యలు చేపట్టాలి
Toopran: తూప్రాన్ మండలం కిష్టాపూర్‌లో మాదిగలపై కుల బహిష్కరణను తీవ్రంగా ఖండించిన బీఎస్పీ. ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలకు డిమాండ్.
Toopran: కిష్టాపూర్‌లో మాదిగలపై కుల బహిష్కరణ బాధ్యులపై చర్యలు చేపట్టాలి
తూప్రాన్: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గము తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామంలో మాదిగ సామాజిక వర్గంపై కుల బహిష్కరణ, బతుకమ్మ ఆడనివ్వకపోవడం, హనుమాన్ ఆలయంలోకి అనుమతించకపోవడం, ఇతర కులాల వారి శుభకార్యాలకు ఆహ్వానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం చేస్తే, ఆహ్వానించిన కుటుంబానికి లక్ష జరిమానా విధించాలని నిబంధనలు పెట్టుకుని కుల వివక్ష చూపిస్తున్న కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ భర్త సుక్క శ్రీశైలం మరియు అతని వర్గం.ఈ విషయాలు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) దృష్టికి రావడంతో ఈ ఘటనను తీవ్రంగా ఖండించిడం జరిగింది.
అదేవిధంగా ఈ అంశంపై బీఎస్పీ నాయకులు తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికతూప్రాన్ ఆర్డీఓ, ఎమ్మార్వో, డిఎస్పీ అధికారులకు ఫిర్యాదు చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ మాదిగ సంఘం యువకులు, పెద్దలు, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్,నియోజకవర్గ ఇంచార్జి కెత్తోజి వినోద్ చారి, అధ్యక్షులు కొమ్ము చంద్రం, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఇంచార్జి కిరణ్ నాయకులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కులవివక్ష, అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి బీఎస్పీ అండగా నిలుస్తుంది.




