Medak: మెదక్ 10వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక పర్యటన!

Medak: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచనలతో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు 10వ వార్డులో పర్యటించి తాగునీరు, డ్రైనేజీ సమస్యలను స్వయంగా పరిశీలించారు.

NAGARAJ, MEDAK
Published on: 4 Nov 2026 8:58 PM IST
Medak
X

Medak: మెదక్ 10వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక పర్యటన!

మెదక్ నవంబర్ 04: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సూచనల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పదో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్యలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా బుడగ జంగాల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రతపై స్థానికులతో మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

అనంతరం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న బస్తీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చింతల లక్ష్మీ దిలీప్ కుమార్‌తో పాటు కౌన్సిలర్లు నస్రిన్ బేగం, చేదల సంధ్య, పల్లె రాణి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK