Choutakur: చౌటకుర్ మండలంలో బీజేపీలోకి భారీ చేరికలు.. 100 మంది యువకుల ప్రవేశం!
Choutakur: సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం శివంపేటలో 100 మంది యువకులు బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పార్టీ కండువాలు కప్పారు.
Choutakur: చౌటకుర్ మండలంలో బీజేపీలోకి భారీ చేరికలు.. 100 మంది యువకుల ప్రవేశం!
చౌటకుర్: సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం శివంపేటలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో నూతన కార్యకర్తల చేరికల కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది యువకులు మరియు నాయకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ చంటి దేవిక ప్రభురెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీలోకి కొత్తగా చేరిన యువకులకు మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీబీ పాటిల్ మాట్లాడుతూ సేవా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, సేవా జ్యోతి యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గత 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారని, సాధారణ ప్రచారక్ స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు మేనిఫెస్టో హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.తెలంగాణలో నేషనల్ హైవేలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా నిమ్జ్ (NIMZ) పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 3 నుండి 4 లక్షల మందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకున్నామని బీబీ పాటిల్ తెలిపారు. సంగారెడ్డి రోడ్డు నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రత్యేక శ్రద్ధతో రోడ్డును అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
దేశంలోని 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలను అందిస్తున్నాయని, తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలకు, అన్ని వర్గాల వారికి పూర్తి స్థాయిలో అభివృద్ధి అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారని బీబీ పాటిల్ తెలిపారు.
అనంతరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు ఉంటుందని, కష్టకాలంలో పార్టీ వారికి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
రాబోయే మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, ఇప్పటినుంచే అభ్యర్థుల ఎంపిక మరియు కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు మండలాల వారీగా పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీపై బీజేపీ ఘనవిజయం సాధించడం పార్టీ భవిష్యత్తుకు శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జగదీష్ పాటిల్ గారు,
భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు బొర్రా ప్రవీణ్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నవాబుపేట భూమయ్య, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు భుట్టో , అడ్వకేట్ చంటి దేవిక, మండల అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, జనరల్ సెక్రెటరీలు గండ్ల శ్రీనివాస్ గారు, మోహన్ ముదిరాజ్ లు మరియు వివిధ గ్రామాల నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




