Manoharabad: కాళ్లకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం!
Manoharabad: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ 44వ జాతీయ రహదారిపై బైక్‌ను డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో దుండిగల్‌కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Manoharabad: కాళ్లకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం!
Manoharabad: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ 44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాళ్లకల్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడు దుండిగల్ వాసిగా గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




