Toopran: మల్కాపూర్‌లో ఘనంగా 425వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 425వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Toopran: మల్కాపూర్‌లో ఘనంగా 425వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ను తెలంగాణరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రొచ్చహం తో యువత గ్రామస్తులు అందరి ఐక్యమాత్యం కలసి ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు మిషిన్ భగీరథ పథకం ప్రవేశపెట్టినప్పుడు యువత ఒక్కేరోజు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.
ముఖ్యమంత్రి మల్కాపూర్ ను ఆదర్శ గ్రామం గా ప్రకటించారు అప్పటి నుండి క్రమం తప్పకుండ ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నారు నేటికీ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 425వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్మశాన వాటికలో చేపట్టారు.
గ్రామస్తులలో ఉత్సాహం నింపేందుకు DLPO సాయిబాబా, MPO సతీష్, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రమదానంలో పాల్గొన్నారు. స్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా DLPO సాయిబాబా మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో మరోసారి మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని అగ్రగామిగా నిలిపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, రేఖ నాగరాజుగౌడ్, సరిత పరమేష్ గౌడ్, మాధవి స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




