Medak: ముత్తాయిపేట సిద్ధేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు ప్రారంభం!

Medak: మెదక్ మండలం ముత్తాయిపేట శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజల వివరాలు ఇక్కడ చూడండి.

RAJU,TOOPRAN
Published on: 10 Nov 2026 12:28 PM IST
Medak
X

Medak: ముత్తాయిపేట సిద్ధేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు ప్రారంభం!

Medak: మెదక్ మండలం ముత్తాయిపేట గ్రామంలోని పురాతన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 09-11-2026 సోమవారం నుండి 08-12-2026 మంగళవారం వరకు నెల రోజుల పాటు మాసోత్సవాలు జరగనున్నాయని ఆలయ పూజారి తెలిపారు.

కార్తీక మాసంలో జరుగు ప్రత్యేక కార్యక్రమాలు:

ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం: శ్రీ స్వామి వారికి అభిషేకములు, నిమోలలంకరణ, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు అన్నపూజ

తేదీ: 23-11-2026 సోమవారం: వైకుంఠ చతుర్దశి సందర్భంగా లక్ష వత్తులు, తులసి వివాహం, రాత్రి 333 కిలోల పండ్లతో స్వామి వారికి అలంకరణ

తేదీ: 24-11-2026 మంగళవారం: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలన, నూనె, వత్తులు, ప్రమిదలు సమర్పణ

తేదీ: 30-11-2026 సోమవారం: శ్రీ సిద్ధేశ్వర స్వామి (శివ పార్వతుల) కళ్యాణం, స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, అన్న సంతర్పణ

తేదీ: 07-12-2026 సోమవారం: మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం, లక్ష పుష్పార్చన, శివతాండవ నృత్య ప్రదర్శన

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 23న 333 కిలోల పండ్ల అలంకరణ, 24న కార్తీక పౌర్ణమి, 30న కళ్యాణం, డిసెంబర్ 7న మాస శివరాత్రి వేడుకలకు భక్తులు సహాయ సహకారాలు అందించాలని ఆలయ పూజారి విజ్ఞప్తి చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN