Gummadidala: పదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక: స్వర్ణలత–గోవర్ధన్ రెడ్డి

Gummadidala: గుమ్మడిదల మండలం కానుకుంటలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ పలుగు స్వర్ణలత గోవర్ధన్ రెడ్డి దంపతులు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

YOGANAND REDDY
Updated on: 18 Oct 2026 8:49 PM IST
Gummadidala
X

Gummadidala: పదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక: స్వర్ణలత–గోవర్ధన్ రెడ్డి

గుమ్మడి దల: దసరా పండుగను పురస్కరించుకుని కానుకుంట గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ పలుగు స్వర్ణలత గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను బహుమతిగా అందజేశారు.

గత పది సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా సఫాయి కార్మికులకు నూతన వస్త్రాలను అందిస్తూ వస్తున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారికి పండుగ సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్మికుల సేవలను గౌరవిస్తూ పదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, గోవర్ధన్ రెడ్డి అమ్మ పలుగు సత్తెమ్మ, గుమ్మడిదల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు నర్సంపల్లి రాజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు గజ్జల మాధవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సోమొల్ల యాదగిరి, కోశాధికారి తోటపల్లి మహిపాల్ రెడ్డి, ఆవుల శ్రీకాంత్, జుర్రు కుమార్, బొమ్మ మల్లేష్, సోమొల్ల సత్యనారాయణ, దుగురి శేఖర్, కడారి సత్యనారాయణ, తోటపల్లి సాయిరాం రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

YOGANAND REDDY

YOGANAND REDDY