Medak: హరీశ్‌రావు, కేటీఆర్‌లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తిరుపతిరెడ్డి

Medak: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి.

NAGARAJ, MEDAK
Updated on: 8 Nov 2026 4:13 PM IST
Medak
X

Medak: హరీశ్‌రావు, కేటీఆర్‌లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తిరుపతిరెడ్డి

మెదక్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావును, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరారు.

చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

దీపాల పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపి, ప్రజలందరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK