Toopran: కోనాయిపల్లి దళితులపై దాడికి నిరసనగా తూప్రాన్‌కు న్యాయ పాదయాత్ర!
Toopran: కోనాయిపల్లిలో దళితులపై దాడి చేసిన సర్పంచ్ మన్నే కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కోనాయిపల్లి నుంచి తూప్రాన్ DSP ఆఫీస్‌కు న్యాయ పాదయాత్ర మొదలైంది.
Toopran: కోనాయిపల్లి దళితులపై దాడికి నిరసనగా తూప్రాన్‌కు న్యాయ పాదయాత్ర!
Toopran: కోనాయిపల్లి (పి.టి) గ్రామ దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు న్యాయ పాదయాత్ర ప్రారంభమైంది.
కోనాయిపల్లి నుండి తూప్రాన్ DSP కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో కోనాయిపల్లి బాధితులు, KVPS, అంబేద్కర్ సంఘం, DBF, MCF, CITU కార్మిక సంఘాలు, MRPS, అంబేద్కర్ న్యాయవాదుల సంఘం మరియు వివిధ రాజకీయ దళిత నాయకులు పాల్గొన్నారు.
దళితులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని పాదయాత్రలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.




