Toopran: నవంబర్ 7న తూప్రాన్‌లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్‌లో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Toopran: నవంబర్ 7న తూప్రాన్‌లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ని పాత ఎంపీడీఓ కార్యాలయం లో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాల తో తూప్రాన్ లోని పాత MPDO భవనంలో రిపేర్లు, మెరుగుదల పనులు పూర్తి చేసి కోర్టును ఏర్పాటు చేశారు. కోర్టు ప్రారంభోత్సవ తేదీని 07.11.2026 గా ఖరారు చేసినట్లు జడ్జి నీలిమ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం జిల్లా జడ్జి నీలిమ నూతన కోర్టు భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను సోమవారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎస్ఐ గంగరాజు, రెవెన్యూ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




