Patancheru: టియుడబ్ల్యూజే హెచ్143 జాతీయ, రాష్ట్ర కౌన్సిలకు ఎంపికైన జర్నలిస్టులు!
Patancheru: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్-143) జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు ఎన్నికయ్యారు.
Patancheru: టియుడబ్ల్యూజే హెచ్143 జాతీయ, రాష్ట్ర కౌన్సిలకు ఎంపికైన జర్నలిస్టులు!
Patancheru: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్) – 143 యూనియన్ జాతీయ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్‌కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు వివిధ హోదాలకు ఎంపికయ్యారని యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ కుమార్, ప్రమోద్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు వడ్ల శ్రీధర్, కొంక రాజ్ కిషోర్ బాబులు ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు జర్నలిస్టుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
పటాన్ చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించడం పట్ల యూనియన్ పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్షులు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంతారం మహేష్ గౌడ్, TEMJU అధ్యక్షులు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సభ్యులకు శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
తమ ఎంపికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ లకు,టెంజు రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




