Jogipet: జోగిపేటలో ప్రభాస్ అభిమానుల సందడి భారీ కటౌట్, కేక్ కటింగ్!
Jogipet: జోగిపేట హనుమాన్ చౌరస్తాలో ప్రభాస్ అభిమానుల సందడి. భారీ కటౌట్ ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన డై హార్డ్ ఫ్యాన్స్.
Jogipet: జోగిపేటలో ప్రభాస్ అభిమానుల సందడి భారీ కటౌట్, కేక్ కటింగ్!
జోగిపేట: జోగిపేట పట్టణంలోని ప్రముఖ కేంద్రమైన హనుమాన్ చౌరస్తాలో ప్రభాస్ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేసి అభిమాన హీరోపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ చౌరస్తా అంతా సందడి వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభాస్, మల్లేష్, వినీల్, ప్రవీణ్‌లతో పాటు పలువురు డై హార్డ్ ఫాన్స్ పాల్గొని కేక్‌ను కట్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు. 'జై ప్రభాస్.. జై జై ప్రభాస్' అంటూ అభిమానులు చేసిన నినాదాలతో హనుమాన్ చౌరస్తా మార్మోగింది. కేక్ కట్ చేసిన అనంతరం అభిమానులందరికీ మిఠాయిలు పంచిపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు.




