Sangareddy: మాయమాటలతో 20 తులాల బంగారం కాజేసిన కేటుగాడు
Sangareddy: జోగిపేట ఇందిరా నగర్లో ఘరానా మోసం. వివాహితను ట్రాప్ చేసి 20 తులాల బంగారం కాజేసిన దుర్మార్గుడు. న్యాయం చేయాలని పోలీసులను కోరిన బాధితురాలు.
Sangareddy: మాయమాటలతో 20 తులాల బంగారం కాజేసిన కేటుగాడు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణం ఇందిరా నగర్ కాలనీకి చెందిన ఒక వివాహితను నమ్మించి, మాయమాటలతో ట్రాప్ చేసిన సదరు దుర్మార్గుడు.. ఏకంగా 20 తులాల బంగారాన్ని కాజేశాడు. ఆ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం.
తీరా దసరా పండుగకు తన బంగారం తనకు ఇవ్వాలని బాధితురాలు నిలదీస్తే... 'ఏం చేసుకుంటారో చేసుకోండి' అంటూ ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చాడనే షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి."ఇక ఈ మోసంపై న్యాయం కావాలంటూ బాధితురాలు తన భర్తతో కలిసి జోగిపేట పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
కానీ, అక్కడ ఆమెకు న్యాయం లభించలేదనే సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మహిళా ద్రోహి వెనుక స్థానిక కౌన్సిలర్లు, కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని, వారి పొలిటికల్ ప్రెజర్ వల్లే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది.
"ఒక పేద కుటుంబాన్ని నడిరోడ్డున పడేసిన ఈ ద్రోహి వెనుక ఉన్న ఆ పొలిటికల్ మాఫియా ఎవరు? ఉన్నతాధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయకుంటే ఊరుకునేది లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు.




