Sangareddy: కాంగ్రెస్ భారీ ర్యాలీ.. సీఈసీ రాజీనామాకు జగ్గారెడ్డి డిమాండ్!

Sangareddy: రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.

SRIKANTH, SANGAREDY
Published on: 12 Oct 2026 3:48 PM IST
Sangareddy
X

Sangareddy: కాంగ్రెస్ భారీ ర్యాలీ.. సీఈసీ రాజీనామాకు జగ్గారెడ్డి డిమాండ్!

Sangareddy: ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 3 వేల మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చేపట్టిన ఈ ర్యాలీ సంగారెడ్డి ఐబీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు రక్షణకు కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY