Sangareddy: సోనియా గాంధీ బయోపిక్ దర్శకుడిగా క్రాంతి మాధవ్‌ను ఎంచుకున్న జగ్గారెడ్డి!

Sangareddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తీయనున్న సినిమాకు క్రాంతి మాధవ్‌ను దర్శకుడిగా ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి, హరి ప్రసాద్ ఆదివారం ప్రకటించారు.

Srinivas K, Sangareddy
Published on: 29 Nov 2026 4:12 PM IST
Sangareddy
X

Sangareddy: సోనియా గాంధీ బయోపిక్ దర్శకుడిగా క్రాంతి మాధవ్‌ను ఎంచుకున్న జగ్గారెడ్డి!

Sangareddy: సోనియా గాంధీ సినిమా కు క్రాంతి మాదన్ పేరును దర్శకులు ఎంపిక చేసిన జగ్గారెడ్డి, హరి ప్రసాద్ .. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీ కి వెళ్లి సోనియాగాంధీ గారి అనుమతి తీసుకోనున్న జగ్గారెడ్డి. గతంలో ఓనమాలు... మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్..

సోనియా గాంధీ తన ఆత్మకథ బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ బుక్ లోని ప్రదనాంశాలను కథాంశాలుగా సినిమా తీయనున్న జగ్గారెడ్డి.. ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా కేవలం గాంధీ కుటుంబ నేపథ్యం ఈ సినిమా తీయనున్నట్టు ప్రకటించిన జగ్గారెడ్డి..

సోనియాగాంధీ రాజీవ్ గాంధీ ల ప్రేమ కథ, ఇందిరా, రాజీవ్ గాంధీ ల బలిదానాలు, దేశం కోసం వారి త్యాగాలు, ఇందిరా, రాజీవ్ గాంధీల అనంతరం సోనియాగాంధీ, దేశం కోసం సోనియా గాంధీ గారు చేసిన సేవలు, ప్రజల కోసం సోనియాగాంధీ రాజకీయ ప్రవేశం.. ప్రధాన మంత్రి పదవుల త్యాగం.. పేద ప్రజల కోసం సంచలన నిర్ణయాలు ఇవన్నీ సినిమాలో స్పష్టంగా చూపించనున్నారు.

సోనియాగాంధీ రాసిన ఆత్మకథ పుస్తకాన్ని దేశ, విదేశీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చూపించేందుకు సినిమా తీస్తున్నామన్న జగ్గారెడ్డి.. ఎవరి నుంచి ఒక్క పైసా తీసుకోమని, మా సంగారెడ్డి నియోజక వర్గ కార్యకర్తలు 50 మందితో ఫైనాన్స్ కమిటీ వేసి మేమే సినిమా తీస్తామని చెప్పిన జగ్గారెడ్డి.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy