Sangareddy: సంగారెడ్డి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలన!
Sangareddy: సంగారెడ్డి పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ ఏర్పాట్లను జగ్గారెడ్డి, నిర్మల పరిశీలించారు. మహిళల కోసం ఇక్కడ ఆరు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
Sangareddy: సంగారెడ్డి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలన!
Sangareddy: సంగారెడ్డి పట్టణం లోని కింది బజార్ చెరువు కట్ట పై జరుగుతున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి,నిర్మల పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు జార్జ్, అశోక్ రెడ్డి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి
కింది బజార్ పెద్ద చెరువు వద్ద బతుకమ్మ పండుగ సంబురాల కోసం చేపడుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల శనివారం రాత్రి పరిశీలించారు. చెరువు కట్ట మొదటి నుంచి చివరి వరకు కాలినడకన తిరుగుతూ లైటింగ్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలపై నిర్వాహకులకు సూచనలు చేశారు.
మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా ఆరు చోట్ల ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా వేదికల వద్ద కళాకారులతో ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రదేశాలను ప్రత్యేక ట్రస్ లైటింగ్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.




