Isnapur: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ
Isnapur: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పాశమైలారంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గాయని గంగా బృందం అలరించింది.
Isnapur: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ
ఇస్నాపూర్: బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి పాశ మైలారం పారిశ్రామిక వాడ ప్రాంతం బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది.
ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని రేలా రేలా గంగా బృందం వారి గాత్రంతో మహిళల్లో నూతన ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మైలారం పారిశ్రామిక వాడ ప్రజలు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ వేడుకలను తిలకించి ఆనంద పరవశం పొందారు.
ఈ వేడుకలకు బిఆర్ఎస్ పటాన్ చెరు ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడీల శ్రీకాంత్ గౌడ్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలను పాషా మైలారం మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోటే కృష్ణ యాదవ్ పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటే సుమలత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలతో ఉత్సాహం నింపారు.




