Toopran: తూప్రాన్ మండలంలో ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.

RAJU,TOOPRAN
Published on: 1 Nov 2026 7:44 AM IST
Toopran
X

Toopran: తూప్రాన్ మండలంలో ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

Toopran: తూప్రాన్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మండలంలోని వట్టూర్, ఇస్లాంపూర్, యావాపూర్, మల్కాపూర్, గుండారెడ్డిపల్లి, వెంకటాయపల్లి, రావెల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తూకం వేయించాలని కోరారు. దళారులు ధర ఎక్కువ చెప్పి తూకంలో మోసం చేస్తారని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురించేస్తారని , రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర - ఏ గ్రేడ్ కు రూ.2461, బీ గ్రేడ్ కు రూ.2441 - ప్రకారం రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. తేమ శాతం పాటించి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని తహసీల్దార్ సూచించారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN