Toopran: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఐజీ ఆదేశాలు!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ డివిజన్ ఆఫీస్‌ను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు పెండింగ్ కేసులు శాంతిభద్రతలపై సమీక్షించి అక్రమాలపై చర్యలకు ఆదేశించారు.
Toopran: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఐజీ ఆదేశాలు!
తూప్రాన్ పోలీస్ డివిజన్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ డివిజన్ కార్యాలయాన్ని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు.
తూప్రాన్ కు విచ్చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అదనపు ఎస్పీ విజయ్ క్రాంత్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పూల మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీసులు ఐజీకి గౌరవ వందనం చేశారు.
డివిజన్ కార్యాలయంలో రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది పనితీరుపై ఐజీ సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో నేరాల నియంత్రణ, గంజాయి, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సి ఐ లు డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.




