Chintakunta: హెచ్‌పీవీ టీకా ఉచితం: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్!

Chintakunta: చింతకుంట PHC పరిధిలో 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత HPV టీకాలు పంపిణీ చేశారు. క్యాన్సర్ నివారణకు ఈ టీకా సంజీవనిలా పనిచేస్తుందని వైద్యాధికారిణి తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 13 Oct 2026 11:32 AM IST
Chintakunta
X

Chintakunta: హెచ్‌పీవీ టీకా ఉచితం: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్!

Chintakunta: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు హెచ్‌పీవీ (HPV) టీకా సంజీవనిలా పనిచేస్తుందని చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వికసిత స్పష్టం చేశారు. మంగళవారం చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక టీకా డ్రైవ్‌లో భాగంగా చిన్న సింగనపల్లె గ్రామానికి చెందిన 14 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేశారు.

​ఈ సందర్భంగా డాక్టర్ వికసిత మాట్లాడుతూ.. సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చుతో కూడుకున్న ఈ వ్యాక్సిన్‌ను, ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఉచితంగా పంపిణీ చేస్తోందని వెల్లడించారు. టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, సాధారణ దుష్ప్రభావాలపై తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సందేహాలుంటే నేరుగా వైద్య సిబ్బందిని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

​"నేటి బాలికల ఆరోగ్యమే రేపటి ఆరోగ్యవంతమైన మహిళా సమాజానికి పునాది" అని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు నుంచి బాలికలకు రక్షణ కల్పించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించే బాధ్యత తల్లిదండ్రులదేనని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివ, గంగరాజు, సీహెచ్‌ఓ హరిచందన, ఏఎన్‌ఎం చంద్రకళ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR