Gummadidala: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కుమార్ గౌడ్

Gummadidala: గుమ్మడిదల మున్సిపాలిటీ 11వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్ కుమార్ గౌడ్. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 8:46 PM IST
Gummadidala
X

Gummadidala: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కుమార్ గౌడ్

గుమ్మడిదల: ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్లు, కాలనీవాసులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకుని, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు కత్తుల రమేష్, నాయకులు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్