Isnapur: లక్దారం గ్రామంలో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన!

Isnapur: పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపాలిటీ లక్దారం గ్రామంలో శుక్రవారం నూతన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన, అన్నదానం వైభవంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 6:06 PM IST
Isnapur
X

Isnapur: లక్దారం గ్రామంలో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన!

Isnapur: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో లక్దారం వార్డులో సోమేశ్వర శివాలయం ఆవరణము వద్ద నూతన శ్రీ అయ్యప్ప దేవాలయం మరియు శ్రీ అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిన లక్దారం అయ్యప్ప స్వాములు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం స్వామి దర్శించుకున్న భక్తులు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గురుస్వామి అర్చకులు గంగాధర్ శర్మ, కావాలి మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, జగదీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, హనుమంతు, పురుషోత్తం, అయ్యప్ప స్వామి దేవాలయం గుజ్జేటి శారద శ్రీనివాస్, అయ్యప్ప స్వామి విగ్రహాల దాత శశికళ హరికృష్ణ గురుస్వామి, మరియు లక్దారం గ్రామ సన్నిధాన స్వాములు, స్థానిక కౌన్సిలర్లు సుమలత అరుణ్ కుమార్, నర్మద గోపాల్, రెడ్డి శ్రీవాణి రవి, గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్