Toopran: రాష్ట్ర స్థాయికి ఎంపికైన తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థిని!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థిని కె. నవ్యశ్రీ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

RAJU,TOOPRAN
Published on: 5 Nov 2026 11:10 AM IST
Toopran
X

Toopran: రాష్ట్ర స్థాయికి ఎంపికైన తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థిని!

Toopran: తూప్రాన్ గీతా స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె. నవ్యశ్రీ 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ మెదక్ జిల్లా స్థాయి సెమినార్ లో అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

నవంబర్ 4వ తేదీ బుధవారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సెమినార్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను జల సముదాయంలో కరిగించి, శుద్ధిచేసే రసాయన పద్ధతిని చక్కగా వివరించినందుకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి. రామాంజనేయులు, చైర్మన్ పి. ఉష, డైరెక్టర్లు బి. రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక, ప్రిన్సిపాల్ అరుణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, సైన్స్ ఉపాధ్యాయులు నవ్యను అభినందించారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN