Baswapur: బస్వాపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, ప్రత్యేక గ్రామసభ!
Baswapur: కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మరియు ప్రత్యేక గ్రామసభను సర్పంచ్ వి. రమణ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Baswapur: బస్వాపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, ప్రత్యేక గ్రామసభ!
Baswapur: బస్వాపూర్ (కామారెడ్డి )మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలతో పాటు గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ శ్రీమతి వి. రమణ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం సాగించిన అహింసాఉద్యమం,సత్యాగ్రహం, స్వదేశీభావన,గ్రామస్వరాజ్యం కోసం చేసిన కృషిని పలువురు గుర్తుచేశారు.సత్యం, అహింస, సేవా భావంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న గాంధీజీ ఆలోచనలు నేటి తరానికికూడాస్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన గ్రామసభలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ అభివృద్ధిలోప్రజలభాగస్వామ్యం కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్, వార్డు సభ్యులు కె. మల్లుగొండ, బి. మహాదేవి, ఎం. నాగనాథ్, హైదర్ సాబ్, షాదుల్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆశ కార్యకర్త డి. నాగమణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, ఐకేపీ వీవోఏ భాస్కర్, కారోబార్ ఎం. గంగారం, మాజీ సర్పంచ్ బి. బస్వంత్, గ్రామ పెద్దలు బసవరాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




