Gajwel: అగ్నివీర్ అభ్యర్థులకు గజ్వేల్ చైర్‌పర్సన్ శుభాకాంక్షలు!

Gajwel: అగ్నివీర్ ఆర్మీ గ్రౌండ్ ఈవెంట్స్‌కు హాజరవుతున్న గజ్వేల్ అభ్యర్థులకు గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అడ్మిట్ కార్డులు అందజేశారు.

Osman Pathan, GAJEWL
Published on: 19 Nov 2026 3:31 PM IST
Gajwel
X

Gajwel: అగ్నివీర్ అభ్యర్థులకు గజ్వేల్ చైర్‌పర్సన్ శుభాకాంక్షలు!

గజ్వేల్: అగ్నివీర్ ఆర్మీ గ్రౌండ్ ఈవెంట్స్‌కు హాజరవుతున్న గజ్వేల్ ప్రాంత అభ్యర్థులకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులను కలిసిన ఆమె వారికి అగ్నివీర్ ఆర్మీ అడ్మిట్ కార్డులను అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ఆప్యాయంగా మాట్లాడి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో గ్రౌండ్ ఈవెంట్స్‌లో పాల్గొని ఆర్మీకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ విజయం సాధించి దేశ సైన్యంలో సేవలందించే అవకాశం దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో స్వయంగా కలిసి అభినందిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈసారి ఎంపిక కాకపోయినా ఎవరూ నిరాశ చెందవద్దని, అపజయాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించి మరింత పట్టుదలతో సాధన కొనసాగించాలని సూచించారు.

జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని, దేశానికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని గజ్వేల్ ప్రాంతానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL