Shivampet: ప్రజాసేవలో ముందున్న మాజీ జెడ్పీటీసీ మహేష్ గుప్తా!

Shivampet: శివంపేటలో కోతుల బెడద నివారణకు మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సొంత నిధులు రూ.5 లక్షల సాయం. ప్రత్యేక సిబ్బందితో కోతుల తరలింపు.. గ్రామస్తుల ప్రశంసలు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 18 Sept 2026 5:30 PM IST
Shivampet
X

Shivampet: ప్రజాసేవలో ముందున్న మాజీ జెడ్పీటీసీ మహేష్ గుప్తా!

శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని శివంపేట గ్రామంలో కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదకు పరిష్కారం చూపేందుకు తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేస్తూ కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు.

కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు

శివంపేట గ్రామంలో కోతుల సంఖ్య పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇళ్లలోకి కోతులు చొరబడటం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, పంటలు, ఇంటి పరిసరాల్లో నష్టం కలిగించడంతో పాటు పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ఈ సమస్యను స్థానికులు మహేష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లడంతో.. సమస్య తీవ్రతను గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు. రూ.5 లక్షలు సొంతంగా ఖర్చు.. ప్రజలకు అండగా మహేష్ గుప్తా కోతుల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించిన మాజీ ZPTC పబ్బ మహేష్ గుప్తా, ఇందుకోసం రూ.5 లక్షలను తన సొంత నిధుల నుంచి వెచ్చిస్తున్నారు.

కోతులను పట్టించే ప్రత్యేక సిబ్బంది ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజా జీవితంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మహేష్ గుప్తా తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో తన వంతు సహాయం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సేవా కార్యక్రమంపై గ్రామస్థుల హర్షం

ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యను గుర్తించి, సొంత డబ్బుతో రూ.5 లక్షలు ఖర్చు చేసి కోతుల బెడద నివారణకు ముందుకొచ్చిన మహేష్ గుప్తాపై శివంపేట గ్రామస్థులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. మాజీ ZPTCగా ప్రజలతో మమేకమై.. ప్రస్తుతం కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తున్న మహేష్ గుప్తా చొరవ శివంపేటలో చర్చనీయాంశంగా మారింది.

అయన తన pmg సేవ సమితి ట్రస్ట్ ద్వారా తాగు నీరు కోసం బోర్లు వేయడం వృద్దులకు ఆసరా గా ఉండడం లాంటి పలు రకాల సేవలు చేస్తున్నందుకు పార్టీలకతీతంగా జిల్లా నుండి కాదు రాష్ట్ర నాయకులు ప్రజలు అభినందిస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR