Beeramguda: బీరంగూడ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు
Beeramguda: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీ కాశీ విశ్వేశ్వర పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Beeramguda: బీరంగూడ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు
బీరంగూడ: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడలో రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆదివారం పర్యటించారు. బీరంగూడ లోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




