Medak: చేగుంటలో జీవిక స్టీల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల ధర్నా, రాస్తారోకో!
Medak: మెదక్ జిల్లా చేగుంటలో జీవిక స్టీల్ పరిశ్రమ వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ రైతులు కంపెనీ ముందు ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
Medak: చేగుంటలో జీవిక స్టీల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల ధర్నా, రాస్తారోకో!
Medak: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జీవిక స్టీల్ పరిశ్రమతో తీవ్ర నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతోందని, వ్యవసాయ పంట పొలాల్లో దుమ్ము ధూళితో పంటలు నష్టపోతున్నాయని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు, గ్రామస్తులు, నాయకులు కలిసి కంపెనీ ముందు టెంట్ వేసి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వెంటనే కంపెనీ అనుమతులు రద్దు చేసి జీవిక కంపెనీని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ "జీవిక స్టీల్ పరిశ్రమ వల్ల మా బోర్లు, బావుల నీరు కలుషితమై తాగడానికి కూడా పనికిరాకుండా పోయిందని . పరిశ్రమ నుండి వచ్చే దుమ్ము, పొగతో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. పశువులకు కూడా రోగాలు వస్తున్నాయి.రైతులు అన్నారు
గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పీసీబీ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే కంపెనీని మూసివేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాం. మా భూములు, మా ప్రాణాలు కాపాడండి" అని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో చేగుంట, చిన్న శివునూర్ చేగుంట, ఉల్లి తిమ్మాయి పల్లి రైతులు, గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చూస్తున్నారు.




