Toopran: బాలికల హైస్కూల్‌లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ బాలికల హైస్కూల్‌లో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

RAJU,TOOPRAN
Published on: 19 Nov 2026 9:06 AM IST
Toopran
X

Toopran: బాలికల హైస్కూల్‌లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన!

Toopran: తూప్రాన్ పట్టణంలోని బాలికల హైస్కూల్‌లో బుధవారం విద్యార్థినుల కోసం సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) పై అవగాహన కార్యక్రమం షీ టీం పోలీసులు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ శ్రీ నరేందర్ గౌడ్ హాజరై విద్యార్థినులకు ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని డిఎస్పీ తెలిపారు. వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఆపద సమయంలో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు.

అదేవిధంగా విద్యార్థినులు తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని, ఇతరులపై ఆధారపడకుండా తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎంఈఓ శ్రీ సత్యనారాయణ, ఎస్ఐ జ్యోతి, షీ టీమ్ సభ్యురాలు స్వరూప, పోలీసు సిబ్బంది మరియు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

అనంతరం కరాటే శిక్షకులు భిక్షపతి మరియు నైనీష్ విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించిన వివిధ పద్ధతులపై ప్రాక్టికల్ డెమో ప్రదర్శించి, ఆపద సమయాల్లో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN