Ameenpur: అమీన్‌పూర్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
Ameenpur: సైబరాబాద్ పరిధిలోని అమీన్‌పూర్ బీరంగూడ వద్ద 10.50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను నార్సింగి ఎస్‌వోటీ పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Ameenpur: అమీన్‌పూర్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
Ameenpur: అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్ పూర్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఇద్దరు నింధితులు అరెస్ట్. బెంగుళూరు నుంచి అమీన్పూర్ కు ఎండీఎంఏ డ్రగ్స్ ను తరలించి, బీరంగూడలోని మండే మార్కెట్ వద్ద విక్రయిస్తుండగ పక్కా సమాచారంతో నార్సింగి ఎస్ ఓ టీ పోలీసుల దాడి చేసి 10.50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ పట్టివేత.
నిందితుల నుండి 10.50 గ్రాముల నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనపరచుకొని అమీన్ పూర్ పోలీసులకు అప్పగించిన ఎస్ ఓ టీ పోలీసులు. నిందితులలో ఒకరు హ్రితిక్ డి పాటిల్ కర్ణాటకకు చెందిన వాడు కాగ, మరొకరు కేరళకు చెందిన సిద్దార్ట్ గ గుర్తించారు, వీరు ఇరువురు ప్రస్తుతం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని పాశమైలారం లో ఉంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




