Sangareddy: జహీరాబాద్‌లో దట్టమైన పొగ మంచు.. 65వ జాతీయ రహదారిపై నెమ్మదిగా వాహనాలు!
Sangareddy: జహీరాబాద్ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తోంది. దీంతో 65వ జాతీయ రహదారిపై ఉదయం 8 దాటినా వాహనాలు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్తున్నాయి.
Sangareddy: జహీరాబాద్‌లో దట్టమైన పొగ మంచు.. 65వ జాతీయ రహదారిపై నెమ్మదిగా వాహనాలు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి సూర్యోదయం వరకు దట్టమైన పొగ మంచు కురుస్తోంది. భారీగా కురుస్తున్న పొగ మంచుతో వాహనదారులు 8 దాటిన లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
గత మూడు రోజులుగా దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ముంబాయి హైదరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారి పై వాహనాలు లైట్లు వేసుకొని నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నాయి. పొగ మంచుతో పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలు అహ్లాదకర వాతావరణంలోని సంతరించుకుంటున్నాయి.




