Sangareddy: ఎండిన పంటలకు ఎకరానికి 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి!

Sangareddy: ఎండిన పంటలకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం నేత చుక్క రాములు. సంగారెడ్డిని కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్.

Srinivas K, Sangareddy
Published on: 1 Nov 2026 8:49 AM IST
Sangareddy
X

Sangareddy: ఎండిన పంటలకు ఎకరానికి 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి!

Sangareddy: ఎల్ నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు లేక ఎండిన పంటలకు ఎకరానికి 50 వేల నష్ట పరిహారం చెల్లించాలని, ప్రధాన ప్రాజెక్ట్ అయిన సింగూర్ ప్రాజెక్టు అడుగంటడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సింగూర్లో నీళ్లు అడుగంటిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కనీసం మంచి నీళ్లు అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలేవని ప్రశ్నించారు. కరువు జిల్లాగా సంగారెడ్డినీ ప్రకటించినా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. ఎల్ నీనో పై సమగ్ర ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలన్నారు.

రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదు గాక పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని పేర్కొన్నారు. రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం కరువు అంచనా వేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరువు పరిస్థితి పై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర కరువు నివేదిక పంపి అత్యవసర ఆర్థిక సహాయం కోరాలన్నారు. ప్రభుత్వ గణాంకాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను ఆధారంగా చేసుకుని సమగ్ర కరువు నివేదిక రూపొందించాలన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై అధికారుల వద్ద సరైన స్పష్టమైన సమాచారం ఏదని ప్రశ్నించారు.

కరువు ప్రచారంతో రాష్ట్రంలో ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయన్నారు. దళారిగా ఏర్పడి సరుకుల కొరత సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ పై తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మానిక్, సాయిలు, నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, మహిపాల్, లలిత, విద్యా సాగర్, రేవంత్, కృష్ణ తది తరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy