Jogipet: జోగిపేటలో దసరా సందర్భంగా 300 మంది యువకులకు నూతన వస్త్రాల పంపిణీ!

Jogipet: జోగిపేటలో దసరా పండుగను పురస్కరించుకుని యువజన సంఘాల యువకులకు ఉచితంగా కొత్త బట్టలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు సురోతంరెడ్డి, శివకుమార్.

UMASHANKAR, ANDOLE
Published on: 12 Oct 2026 6:27 PM IST
Jogipet
X

Jogipet: జోగిపేటలో దసరా సందర్భంగా 300 మంది యువకులకు నూతన వస్త్రాల పంపిణీ!

Jogipet: దసరా పార్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల సురోతంరెడ్డి, సార శివకుమార్లు సోమవారం ఉచితంగా కొత్త బట్టలు పంపిణి చేశారు. పట్టణంలోని యువజన సంఘాల యువకులకు సుమారు మూడు వందల మందికి హోసింగ్ బోర్డు కాలనిలోని తన ఇంటి పంపిణీ చేశారు. వినాయకుడి మండపాల యువజన సంఘాలను గుర్తించి ఉచితంగా అందజేశారు. ప్రతి ఒక్కరు పండుగరోజు నూతన వస్త్రాలు ధరించాలనే ఉద్దేశ్యం తో యువకులకు అందజేసినట్లు సురోతంరెడ్డి, శివకుమార్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రంలో నాయకులు రాయిస్, చింతకుంట శివ, వివేకానంద సభ్యులు ప్రవీణ్, మాణినాగ్, సాయిదిలీప్, అఖిల్, డాకూరి సాయి,తదితరులు పాల్గొన్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE