Shivampet: శివంపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Shivampet: మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 8 Nov 2026 8:34 PM IST
Shivampet
X

Shivampet: శివంపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

శివంపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా స్వగృహంలో PACS చైర్మన్ వెంకటరామిరెడ్డి, AMC మాజీ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బుర్ర మురళి గౌడ్, PACS వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, గుండ్లపల్లి సర్పంచ్ నర్సింలు, దంతంపల్లి సర్పంచ్ నర్సింలు, బిమ్లా తాండ సర్పంచ్ దుర్గా నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్, వేణు రెడ్డి, వారాల గణేష్, కొత్త గొల్ల యాదగిరి, కుమ్మరి హనుమంతు, గొట్టుముక్కల వీరస్వామి, వంజరి నాగభూషణం, కమలయ్య, వెంకటేష్, ప్రభు లింగం గౌడ్, వర్రీ మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, రాములు యాదవ్, నీరుడి ఆంజనేయులు, మహేష్ యాదవ్, సోను, సల్మాన్, నిశాంత్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలతో శివంపేటలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR