Chinna Gottimukla: చిన్న గొట్టిముక్లలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

Chinna Gottimukla: చిన్న గొట్టిముక్లలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 30 Sept 2026 8:40 PM IST
Chinna Gottimukla
X

Chinna Gottimukla: చిన్న గొట్టిముక్లలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

చిన్న గొట్టిముక్ల: ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, హక్కులు, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు చిన్న గొట్టిముక్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ) నిరంజన్, జీపీఓ నరేంద్ర, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, పోలీస్ సిబ్బంది యాదగిరిగౌడ్, వేరస్వామి తదితరులు పాల్గొని ప్రజలకు పలు అంశాలపై వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు, దరఖాస్తు విధానం, పథకాలను పొందే మార్గాలపై అవగాహన కల్పించారు.

అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించి తగిన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణరావు, ఉప సర్పంచ్ పాపయ్యాచారి, గ్రామ పెద్దలు, నాయకులు కిషన్ రావు, నరసింహారావు, నరేందర్, రాంలు, సంతోష్, నరసింహులు, భాషయ్య, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చూడటమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని గ్రామ పంచాయతీ పాలకవర్గం పేర్కొంది...

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur