Narsapur: గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి పీఎంఈజీపీ, ఎస్‌వీఈపీ ఊతం!

Narsapur: నర్సాపూర్‌లో చిలిపిచెడ్ బీఆర్‌సీ సమావేశం జరిగింది. గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధి, ఎస్‌వీఈపీ, పీఎంఈజీపీ ప్రభుత్వ రుణ పథకాల అనుసంధానంపై సమీక్షించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 Oct 2026 9:02 PM IST
Narsapur
X

Narsapur: గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి పీఎంఈజీపీ, ఎస్‌వీఈపీ ఊతం!

నర్సాపూర్: మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండల కేంద్రం లోని బ్లాక్‌లో బ్లాక్ రిసోర్స్ కోఆర్డినేషన్ (BRC) సమావేశం నర్సాపూర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో SVEP కార్యకలాపాల పురోగతి, గ్రామీణ స్థాయిలో Entrepreneurs అభివృద్ధి, ప్రభుత్వ రుణ పథకాలతో అనుసంధానం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు, సిబ్బంది చర్చించారు.

ఈ సందర్భంగా MSME ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, సత్యేంద్రతో పాటు KVIC సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలితా దేవి CRPలు, Entrepreneurs‌కు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామోద్యోగ్ వికాస్ యోజన (GVY), PMEGP రుణ పథకాలు, వాటి ద్వారా లభించే అవకాశాలు, రుణాల అనుసంధానం తదితర అంశాలను వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహకారం అందించడం వంటి అంశాలపై సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో అమర్ సింగ్, APM గౌరీ శంకర్, సంగమేశ్వర్, SVEP మెంటర్, BRC పాలక సభ్యులు, CRPలు, గ్రామ స్థాయి Entrepreneurs పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR