Sangareddy: సింగూరు ప్రాజెక్టును సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు!
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పర్యటించారు.
Sangareddy: సింగూరు ప్రాజెక్టును సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు!
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును సందర్శించి, హైదరాబాద్కు తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా తీరును పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తమయ్యారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, సరఫరా పరిస్థితులు, ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో చర్చించారు.
మిషన్ భగీరథ పంపు హౌస్ వద్దకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో పాటు పోలీసు కవాతుతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




