Toopran: తూప్రాన్‌లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
Toopran: తూప్రాన్ పట్టణంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Toopran: తూప్రాన్‌లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలపై తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తూప్రాన్ పట్టణానికి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు.
ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువాను కూడా పగలగొట్టి అందులో దాచిన సుమారు ఐదు తులాల వెండి చైన్, పావు తులం బంగారు ఆభరణం మరియు కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగరాజు తెలిపారు
ప్రజలకు పోలీసుల సూచన: ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే నమ్మకమైన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎసై గంగరాజు సూచించారు.




