Sangareddy: వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి..బీఆర్‌ఎస్ డిమాండ్!
Sangareddy: వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఎస్‌ఈకి ఇంద్రకరణ్ బీఆర్‌ఎస్ నాయకుడు మహిపాల్ వినతిపత్రం అందజేశారు.
Sangareddy: వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి..బీఆర్‌ఎస్ డిమాండ్!
Sangareddy: రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ ఇంద్రకరణ్ గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మహిపాల్ సంగారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో సాగు పనులు సకాలంలో చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలకు తక్షణమే స్వస్తి పలికి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మహిపాల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన్నె యాదయ్య ,మందడ ఉమరెడ్డి, మల్లేశం , పుర్ర గోపాల్ ,కృష్ణ , యాదయ్య , సత్యనారాయణ , పరమయ్య తదితరులు ఉన్నారు.




