Patancheru: కరాటే పోటీల్లో సత్తా చాటిన పటాన్‌చెరు విద్యార్థులు!

Patancheru: విశాఖ సౌత్ జోన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన పటాన్‌చెరు విద్యార్థులను బీఆర్‌ఎస్ నాయకులు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సింధు అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2026 12:57 PM IST
Patancheru
X

Patancheru: కరాటే పోటీల్లో సత్తా చాటిన పటాన్‌చెరు విద్యార్థులు!

Patancheru: విశాఖపట్నంలోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ KIO సౌత్ జోన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన మాస్టర్ జి. అగస్టిన్ ఆధ్వర్యంలోని సెరియోకు షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ని, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. సింధు ఆదర్శ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కరాటే పోటీల్లో విద్యార్థులు సాధించిన విజయాలను వారు అభినందించారు. జి. విహాన్ కుమిటేలో స్వర్ణ పతకం, కటాలో రజత పతకం సాధించగా, జి. రిత్విక్ కుమిటేలో స్వర్ణ పతకం, కటాలో కాంస్య పతకం సాధించారు. వై. తన్వి రెడ్డి కుమిటేలో రజత పతకం, సయ్యద్ మహమ్మద్ తాహా, హెచ్. ఆద్య శ్రీ కటాలో కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటారు.

ఈ ఐదుగురు విద్యార్థులు డిసెంబర్ 16, 17 తేదీల్లో ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల సింధు ఆదర్శ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, పటాన్‌చెరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలకు కృషి చేసిన మాస్టర్ జి. అగస్టిన్‌ను కూడా వారు అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్