Andole: అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటాం!

Andole: అందోల్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎస్‌టీపీసీ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి స్వామి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

UMASHANKAR, ANDOLE
Published on: 19 Oct 2026 8:31 AM IST
Andole
X

Andole: అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటాం!

Andole: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి (దసరా) పండగను అందోల్ నియోజకవర్గ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి స్వామి ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయదశమి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు మరియు సంపదలతో విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా బిక్షపతి స్వామి పునరుద్ఘాటించారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE