Patancheru: ఘనంగా ఛట్ పూజ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్!

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సాకి చెరువు వద్ద ఘనంగా ఛట్ పూజ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 11:41 AM IST
Patancheru
X

Patancheru: ఘనంగా ఛట్ పూజ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్!

Patancheru: పటాన్‌చెరు, జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సాకి చెరువు, అల్విన్ కాలనీ, బాలాజీ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, నేతాజీ నగర్ ప్రాంతాల్లో ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఛట్ పూజ వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు, ఉత్తర భారతీయ సోదర సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఛట్ పూజ సందర్భంగా భక్తులు సూర్యభగవానుడు, ఛట్టి మాతను ఆరాధిస్తూ చెరువుల తీరాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం భక్తులు ఎంతో నియమనిష్ఠలతో ఈ పవిత్ర పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఛట్ పూజ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని అన్నారు. సూర్యభగవానుడిని ఆరాధిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఈ పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గం మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందిందని, వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఐకమత్యంతో జీవించడం ఈ ప్రాంత ప్రత్యేకత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాలను గౌరవించుకుంటూ, పరస్పర సోదరభావంతో పండుగలను జరుపుకోవడం సామాజిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉంటూ, ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఛట్ పూజ సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, సూర్యభగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాద్రి పృథ్వీరాజ్ ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్