Ramayampet: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత!
Ramayampet: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి!
Ramayampet: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత!
Ramayampet: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన తొగరి రోజా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి, మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5 వేల ఆర్థిక సాయాన్ని నాయకుల ద్వారా అందజేశారు.
కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి, భాస్కర్రెడ్డి, తుడుం శ్రీనివాస్, నరసింహారెడ్డి, రవి, కర్రె అశోక్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




