Sangareddy: అన్నాసాగర్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ రైతు ధర్నా!

Sangareddy: అందోల్ మండలం అన్నాసాగర్ సబ్‌స్టేషన్ వద్ద అప్రకటిత విద్యుత్ కోతలపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు ధర్నా. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్.

UMASHANKAR, ANDOLE
Published on: 13 Oct 2026 5:46 PM IST
Sangareddy
X

Sangareddy: అన్నాసాగర్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ రైతు ధర్నా!

Sangareddy: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ 132/33 కేవీ సబ్ స్టేషన్ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా బిఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నా ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలకు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు బిఆర్ఎస్ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటలుగా నాందేడ్ అఖోలా ప్రధాన రహదారిపై భైరాయించడంతో మూడు కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ నెలకొంది.రంగ ప్రవేశం చేసిన జోగిపేట పోలీసులు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో ధర్నా విరమించాలని వాగ్వాదానికి దిగారు. దీంతో తిరగబడ్డ రైతన్నలు వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదేమీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిగా అసమర్ధ పాలన కొనసాగుతుందని అన్నారు. రైతుల గోడును పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ పాలన చేతకాకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రభుత్వం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ లేక పంటలు ఎక్కడెక్కడ ఎండిపోతుంటే ప్రభుత్వం పొద్దు నిధులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని క్రాంతి కిరణ్ మండిపడ్డారు. అప్రకటిక విద్యుత్తును రైతులకు శాపంగా మారాయని వెంటనే కలుగజేసుకుని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రభుత్వం కృషిచేయాలని ప్రభుత్వాన్ని క్రాంతి కిరణ్ కోరారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE