Medak: పేదల ఇళ్లలో వెలుగులే లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Medak: మెదక్ నియోజకవర్గంలోని 4 గ్రామాల్లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.
Medak: పేదల ఇళ్లలో వెలుగులే లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి జీవితాల్లో సంతోషాలు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
ఆదివారం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా హవేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తాండ, లింగసాన్ పల్లి తాండ, మెదక్ మండలంలోని శివాయపల్లి, శంకరంపేట (ఆర్) మండలంలోని మిర్జాపల్లి తాండ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడం ప్రతి పేద కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన సంతోషమని పేర్కొన్నారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంతోషాల్లో భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.




