Chitkul: ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ: నీలం మధు ముదిరాజ్

Chitkul: చిట్కుల్‌లోని తన నివాసంలో నీలం మధు ముదిరాజ్ దంపతులు సద్దుల బతుకమ్మ పూజలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Oct 2026 8:28 PM IST
Chitkul
X

Chitkul: ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ: నీలం మధు ముదిరాజ్

Chitkul: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

చిట్కుల్ లోని ఆయన నివాసంలో తన సతీమణి నీలం కవిత సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమంతా గ్రామ గ్రామాన అక్క చెల్లెలు సంబరంగా నిర్వహించుకునే పూల పండగ బతుకమ్మ అన్నారు.

బతుకమ్మ పాటలతో ఆటలతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సామాజిక సంబురం ఈ పండగ అని కొనియాడారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణకే దక్కిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందనీ స్పష్టం చేశారు.

మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఆ గౌరీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిరవిల్లాలని ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్