Sangareddy: జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసు ఛేదన!

Sangareddy: జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు. మామను సుపారి ఇచ్చి హత్య చేయించిన అల్లుడు బస్వరాజ్, ముగ్గురు స్నేహితుల అరెస్ట్.

YOGANAND REDDY
Published on: 12 Oct 2026 8:00 PM IST
Sangareddy
X

Sangareddy: జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసు ఛేదన!

Sangareddy: జహీరాబాద్ లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు. స్నేహితులకు సుపారి ఇచ్చి మామ శ్రీనివాస్ ని హత్య చేయించిన అల్లుడు బస్వరాజ్.

స్నేహితులు రమేష్, సుభాష్, మురళిలతో మామ హత్యకు 5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ గా 2 లక్షలు ఇచ్చి హత్య అనంతరం మిగతా డబ్బులు ఇస్తానని హామీ కుటుంబ కలహాలతోనే మామని స్నేహుతులతో కలిసి హత్య చేసిన అల్లుడు బస్వరాజ్. అల్లుడు బస్వరాజ్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన జహీరాబాద్ పోలీసులు.

నాలుగేళ్ళ క్రితం వికారాబాద్ జిల్లాకి చెందిన బస్వరాజ్ కి కుతురునిచ్చి పెళ్లి చేసిన శ్రీనివాస్. మూడేళ్ళ నుంచి కుటుంబ కలహాలతో పుట్టింటి వద్దే ఉంటున్న శ్రీనివాస్ కూతురు విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా భరణం కింద బస్వరాజ్ ఆస్తిలో సగం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసిన భార్య ఆగ్రహంతో భార్య, అత్తమామలపై కక్ష పెంచుకున్న బస్వరాజ్. మామని ఎలాగైనా హత్యచేయాలని స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి ఈ నెల 7న శ్రీనివాస్ ఆటోని ప్లాన్ ప్రకారం కిరాయికి మాట్లాడిన బస్వరాజ్ స్నేహితులు, దారి మధ్యలో మద్యం తీసుకుని తూముకుంట శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన అల్లుడు.

అక్కడే మామ శ్రీనివాస్ పై స్నేహితులతో కలిసి దాడి చేసి హత్యచేసిన బస్వరాజ్. హత్య అనంతరం మృతదేహాన్ని, ఆటోని పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి పరార్ అయిన నిందితులు.

YOGANAND REDDY

YOGANAND REDDY