Narsapur: నర్సాపూర్ పెన్షన్ల పంపిణీ సభలో పోలీసులతో బీఆర్ఎస్ వాగ్వాదం!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ సభలో బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను వేదికపైకి అనుమతించలేదని పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగారు.
Narsapur: నర్సాపూర్ పెన్షన్ల పంపిణీ సభలో పోలీసులతో బీఆర్ఎస్ వాగ్వాదం!
దిశ, నర్సాపూర్: బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో నూతన చేయూత పెన్షన్ ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయితే పెన్షన్ల ఉత్తర్వులు పంపిణీ చేసే క్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ మోయిజ్ ను సభా వేదిక పైకి పోలీసులు అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు కౌన్సిలర్ మోయిజ్ ను వేదిక పైకి అనుమతించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయుముద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లను మాత్రమే వేదికపైకి అనుమతించి బీఆర్ఎస్ కౌన్సిలర్ ను అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు అందరికీ సమానమైన ప్రోటోకాల్ ఉండాలని వెల్లడించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వేదికపై ఉండగానే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది.




