Andole: పాలపిట్టను బంధించిన అందోల్ సర్పంచ్‌కు అటవీశాఖ నోటీసులు
Andole: దసరా వేళ పాలపిట్టను బంధించిన నేరేడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్‌కు అటవీశాఖ నోటీసులు. డిఆర్ఓ మాధవి లత ఆధ్వర్యంలో విచారణ, కేసు నమోదుకు సన్నాహాలు.
Andole: పాలపిట్టను బంధించిన అందోల్ సర్పంచ్‌కు అటవీశాఖ నోటీసులు
అందోల్: దసరా పండుగ వేళ వన్యప్రాణి చట్టాలను తుంగలో తొక్కి, తెలంగాణ రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను బంధించిన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నేరేడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ ఉదంతంపై అటవీ శాఖ అధికారులు వేగంగా స్పందించారు. ఈ వివాదాస్పద ఘటనపై HMTV ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించింది.
ఆందోల్ డిప్యూటీ రేంజ్ అధికారి (DRO) మాధవి లత ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది నేరేడిగుంట గ్రామంలోని సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ నివాసానికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో సర్పంచ్ సాయి కిరణ్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో, అధికారులు అతని తల్లికి అధికారిక నోటీసులను అందజేశారు. పాలపిట్టను బంధించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (వన్యప్రాణి సంరక్షణ చట్టం) కింద సర్పంచ్‌పై త్వరలోనే అధికారికంగా కేసు నమోదు చేయనున్నట్లు డిప్యూటీ రేంజ్ అధికారి మాధవి లత స్పష్టం చేశారు. చట్టాలు చెప్తున్నా వినకుండా, నోరులేని జీవిని హింసించిన ప్రజాప్రతినిధిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.అధికారులు తీసుకుంటున్న ఈ తక్షణ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.




